దుబాయ్‌ నుంచి కడెంకు చేరిన అబ్దుల్ రఫీక్ మృతదేహం

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రానికి చెందిన అబ్దుల్ రఫీక్ (37) ఇటీవల దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహం ఆదివారం స్వగ్రామమైన కడెంకు చేరుకుంది.

మృతదేహాన్ని చూసిన భార్య, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. వారి రోదనలతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. అబ్దుల్ రఫీక్ మృతదేహానికి నివాళులర్పించేందుకు గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలివచ్చారు.

ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన అబ్దుల్ రఫీక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.

కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న అబ్దుల్ రఫీక్ ఆకస్మిక మరణంతో వారి భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వం స్పందించి మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు. అబ్దుల్ రఫీక్ మృతితో కడెం మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *