కాలనీ సమస్యలు తీర్చరు.. కానీ ఓట్లు అడుగుతారు

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీలోని 20 వార్డులో ఉన్నటువంటి శాంతినగర్ హనుమాన్ నగర్ లోని సమస్యలను అధికార కాంగ్రెస్ నాయకులు పరిష్కరించరు కానీ నేడు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి మాత్రం వస్తారని ఆరోపించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నగవత్ ప్రభాకర్ వార్డులను సమస్యలను ఉద్దేశించి మాట్లాడారు. భూపాలపల్లి మొదటి కాలనీలైన శాంతినగర్ హనుమాన్ నగర్ లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. అందులో ముఖ్యంగా తాగునీటి సమస్య , ఇళ్ల పట్టాల సమస్య, నిరుద్యోగ సమస్య లాంటి ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ నాయకులు విఫలమయ్యారని మండిపడ్డారు. తాను మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వీటి సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉంటానని హామీ ఇచ్చారు.
