Mrigasira Karte Effect | పెద్దచెరువులో చేపల కోసం పోటీ

Mrigasira Karte Effect | పెద్దచెరువులో చేపల కోసం పోటీ

Mrigasira Karte Effect | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : మృగశిర కార్తె సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రం శివారులోని పెద్ద చెరువులో చేపల లూటీ జరిగింది. ఈ విషయం తెలియడంతో పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకుని చేపలు పట్టేందుకు పోటీ పడ్డారు.

చేతికి చిక్కిన వలలు, బుట్టలు, గాలాలు, ఇతర సామగ్రితో చెరువులోకి దిగిన స్థానికులు చేపల వేటలో మునిగిపోయారు. ఒకేసారి వందలాది మంది చెరువులోకి దిగడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.

చేపలు పట్టేందుకు యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొనగా, ఈ దృశ్యాలను చూసేందుకు కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మృగశిర కార్తె సందర్భంగా చేపలు తినడం శుభప్రదంగా భావించే సంప్రదాయం నేపథ్యంలో ప్రతి ఏడాది ఇలాంటి సందడి కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు.

Leave a Reply