Bellampally | విచారణ పేరుతో కార్మికులను వేధింపులు…

Bellampally | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోనిశాంతిఖని పాత బొగ్గు గనిలో సర్ఫేస్ నుంచి 4 వ లెవెల్ బెల్ డీప్ లో గత ఆదివారం రెండవ షిఫ్ట్ లో కాపర్(195 స్క్వేర్ ఆర్మూర్ కేబుల్ )285 మీటర్ల కు పైగా వైరు చోరీ కి గురైన సంఘటనపై దర్యాప్తు నవమాత్రంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. లక్షలాది రూపాయల విలువ గల కాపర్ వైర్ చోరీ జరిగిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరుపల్సిన యాజమాన్యం కింది స్థాయి అధికారులచే విచారణ జరపడం పలు విమర్శలకు తావిస్తోంది.

ఈ ఘటనను ఆసరాగా చేసుకున్న కొందరు అధికారులు తమ పేర్లు ఎక్కడ బయటపడతాయో నని బావించి కేవలం కార్మికులనే విచారణ జరపడం ఆ అధికారులు కార్మికుల పై దుందుడుకుగా వ్యవహరించడం పైవిమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఫిబ్రవరి 1 వ తేదిన గని మేనేజర్, ఒక అండర్ మేనేజర్ కలిసి విచారణ జరపడం చర్చనీయంసంగా మారింది. లక్షలాధిరూపాయల విలువ గల వైరు చోరీ కి గురికావడం అధికారుల పర్యవేక్షణ లోపం ప్రధాన కారణమైనప్పటికి అది పట్టించుకోకుండా గత ఆదివారం రోస్టర్ విధుల్లో ఉన్న అధికారులతోనే విచారణ జరిపించడం పొట్ల పలు విమర్శలు వ్యక్తంఅవుతున్నాయి.

ఘటన జరిగిన నాడు విధుల్లో పాల్గొన్న అధికారులను కాకుండా కేవలంకార్మికులను విచారించడం పై పలు అనుమానాలువ్యక్తమౌ తున్నాయి. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కాపర్ వైర్ చోరీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు కార్మికులు అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సింది పోయి కార్మికులపైన నెట్టేసేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నా రనేచర్చకూడాజరుగుతోంది.

Leave a Reply