Parakala | అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం..

Parakala | అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం..

Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వినతిపత్రంతో నిరసన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అక్రమ సిట్ నోటీసులు అందివ్వడాన్ని ఖండిస్తూ, రేవంత్ రెడ్డి సర్కారుకి భారత రాజ్యాంగం, చట్టాలపై అవగాహన కల్పించాలని కోరుతూ పరకాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రేగురి విజయపాల్ రెడ్డి, బండి సారంగపాణి, గురజాపల్లి ప్రకాష్ రావు, చందుపట్ల నరసింహారెడ్డి, శనిగరం నవీన్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.