ముదిరాజ్ జాతి అభివృద్ధికి కృషి చేయాలి

ముదిరాజ్ జాతి అభివృద్ధికి కృషి చేయాలి

  • ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు నీల గట్టయ్య

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : ముదిరాజ్ జాతి సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు నీల గట్టయ్య పేర్కొన్నారు. బుధవారం స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి గ్రామంలో ముదిరాజ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గోరంట్ల యాదగిరి ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.

ఈ సందర్బంగా ముందుగా ఇటీవల 2026 పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 539 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిన గోరంట్ల సాయి శ్రేష్ఠ ను ఆయన శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ముదిరాజ్ కుల బంధువులు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. చదువుల్లో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులు ఉద్యోగ అవకాశాల్లో ముందుకు రావాలంటే రిజర్వేషన్ల పరంగా మరిం త పురోగతి అవసరమని అభిప్రాయపడ్డారు. ముదిరాజ్ జాతిని బీసీ- డి నుండి బీసీ-ఏకి మార్చాలన్న చిరకాల కోరికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ నీల రాజు, జిల్లా డైరెక్టర్ బూర్ల శంకర్, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, మత్స్య పారిశ్రామిక మండ ల మహిళా కార్యదర్శి పిట్టల స్వరూప, శివునిపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘ చైర్మన్ చిక్కుడు రమేష్, ప్రధాన కార్యదర్శి పిట్టల అశో క్, ఉపాధ్యక్షులు చెన్నూరు వేణు, డైరెక్టర్లు గోరంట్ల చంద్రు, కొండరాజు, నీల రాజు, సోమయ్య, వెంకన్న, శ్రీనివాస్, పెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యులు సమ్మయ్య, రవి, రాజు, పెద్దాపురం, వేణు, ఆంజనే యులు, సారయ్య, అనిల్, ప్రశాంత్, సొసైటీ సభ్యులు సురేష్, రాకేష్, శ్రీకాంత్, అజయ్, తిరుపతి, రాజశేఖర్, శివలింగం, రమేష్, నాగరాజు, రాకేష్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.