ప్రతి ఇంట్లో దోమల నివారణ చర్యలు తీసుకోవాలి..
ప్రతి ఇంట్లో దోమల నివారణ చర్యలు తీసుకోవాలి..
- నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలి
సర్పంచ్ పనికర సోమయ్య
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : ప్రతి ఇంట్లో దోమల నివారణ చర్యలు తీసుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సర్పంచ్ పనికర సోమయ్య పేర్కొన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలం కోమటి గూడెం గ్రామంలో శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగం గా ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పం చ్ పనికర సోమయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలో పరిశుభ్రత పాటించడం ద్వారా మలేరియా వంటి వ్యాధులను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపడు తున్న కార్యక్రమాలను అందరూ వినియోగించుకోవాలని కోరారు. అనం తరం అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులకు డ్రెస్సులను పంపిణీ చేశా రు.

పిల్లల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు చిట్యాల విమల, బోయిని రాకేష్, పంచాయతీ సెక్రటరీ మహేందర్, ఏఎన్ఎం రాజ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్ బోయిని పద్మ తదితరులు పాల్గొన్నారు.
