జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం
- అధ్యక్షులు పి.గట్టయ్య..
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ ; ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి నూతన కార్యవర్గాన్ని శనివారం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తూ, వారికి అందుబాటులో ఉంటూ, ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయానికి మా సాయి శక్తుల కృషి చేస్తామని అన్నారు. మా సభ్యులు మాకు సహకరించాలని త్వరలో ప్రెస్క్లబ్ కార్యాలయం నిర్వహిస్తామని తెలిపారు. నూతన కమిటీ అధ్యక్షులు పిలుమాల్ల గట్టయ్య (మెట్రో ఈవినింగ్), ప్రధాన కార్యదర్శి మారపల్లి వేణుగోపాల్ రెడ్డి (ఆంద్రప్రభ), కోశాధికారి అరేల్లి గోపికృష్ణ (మన సమాజం), లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారుగా ఈదునూరి సారంగారావు ( జనం సాక్షి), గౌరవాధ్యక్షులు ఆరంధ స్వామి ( సిటీ కేబుల్), వెంగళదాస్ సంతోష్ (మనం), తాండ్ర సతీష్ (ఆంధ్రజ్యోతి), వర్కింగ్ ప్రెసిడెంట్ కలువల శ్రీనివాస్( జర్నలిస్ట్ ), ప్రచార కార్యదర్శి గా నాంపల్లి గట్టయ్య (నేటిధాత్రి), ఉపాధ్యక్షులు గంగారపు గౌతమ్ కుమార్ (ప్రజా పక్షం), పిడి రాజేంద్ర ప్రసాద్ (తెలంగాణ గళం), కొండ శ్రీనివాస్ (మన తెలంగాణ), బండ అమర్నాథ్ రెడ్డి (వుదయం), పురుషోత్తం గంగులు (ప్రజా దర్బార్), సహాయ కార్యదర్శులుగా నెల్లూరి శ్రీనాథ్ ( సూర్య), నాసబత్తుల ప్రవీణ్ (నవ తెలంగాణ), దాసరి స్వామి (ప్రత్యక్ష సాక్షి) , ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కొమ్ము సదానందం( విజయ భారతీ), దుర్గం వెంకట స్వామి( టుడేస్ న్యూస్),మోరె రవీందర్(టీ మీడియా) లు ఎన్నికయ్యారు.
