సామాజిక సృహ,సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి

సామాజిక సృహ,సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి
- ఎస్ఆర్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రవీందర్
హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సామాజిక సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఎస్ఆర్ అసోసియేట్ ఫిజికల్ డైరెక్టర్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కొప్పుల రవీందర్ సూచించారు. ఎస్ఆర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ బిఎస్‌సీ అగ్రికల్చర్ విద్యార్థులు, రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ సహకారంతో శనివారం జీడబ్ల్యూఎంసి పరిధిలోని ఎల్లాపూర్ లో విజయవంతంగా కమ్యూనిటీ అవుట్ రిచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ మేరకు విద్యార్థుల్లో గ్రామీణ ప్రజల పట్ల అవగాహన పెంపొందించడం, సామాజిక బాధ్యత విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించిన శిబిరంలో వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ ఆరోగ్య అవగాహన, వృక్షారోపణ,పరిశుభ్రత కార్యక్రమాలు, పేద పిల్లలకు బోధన, ప్రభుత్వ పథకాలపై అవగాహన, మహిళా సాధికారత, ప్లాస్టిక్ రహిత ప్రచారాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఆరోగ్యం, విద్య, పర్యావరణం వంటి అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థులకు-సమాజం మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు ఎంతో చురుకుగా పాల్గొని సమాజ సేవ,బాధ్యత గ్రామాభివృద్ధికి నిబద్ధత అనే సందేశంతో ప్రజలతో పాలుపంచుకున్నారు
