8women | శీతల మాత ఆలయంలో తొక్కిసలాట విషాదం
8women | శీతల మాత ఆలయంలో తొక్కిసలాట విషాదం
8women | భారీగా భక్తులు గుమిగూడడంతో తొక్కిసలాట
అధిక సంఖ్యలో భక్తులు ఒకేసారి
సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స
ఈ ఘటనపై పోలీసులు కేసు
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బీహార్‌లోని నాలంద జిల్లాలో శీతల మాత ఆలయంలో భారీగా భక్తులు గుమిగూడడంతో తొక్కిసలాట చోటుచేసుకుని విషాదం నెలకొంది. ఈ ఘటనలో పలువురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
బీహార్ రాష్ట్రంలోని నాలంద జిల్లాలో ఉన్న శీతల మాత ఆలయంలో మంగళవారం భారీగా భక్తులు గుమిగూడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనీసం 8 మంది మహిళలు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
అధిక సంఖ్యలో భక్తులు ఒకేసారి ఆలయానికి చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పి ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

