Mega158 | 12 గంటల యాక్షన్ షూట్.. చిరంజీవి డెడికేషన్ కి హాట్సాఫ్
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి వయసు అనేది కేవలం జస్ట్ ఒక నెంబర్ మాత్రమే అని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం దర్శకుడు బాచీ తెరకెక్కిస్తున్న #Mega158 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే ఈ షూటింగ్ లో చిరంజీవి వరుసగా దాదాపు 12 గంటల పాటు హై-ఎనర్జీ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్నట్లు సినీ వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది.
సాధారణంగా ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు శారీరకంగా ఎంతో కష్టంగా ఉంటాయి. అయినప్పటికీ చిరంజీవి 70 ఏళ్ల వయసులో కూడా ఎలాంటి అలసటకు లోనుకాకుండా పూర్తి అంకితభావంతో షూటింగ్లో పాల్గొనడం యూనిట్ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలుస్తోంది. ఆయన ఎనర్జీ, డెడికేషన్‌ను చూసి చిత్రబృందం ప్రశంసలు కురిపించినట్లు సమాచారం.
దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న చిరంజీవి ఇప్పటికీ అదే క్రమశిక్షణ, అదే కష్టపడే తత్వంతో పనిచేస్తుండటం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. ప్రతి సినిమాతో తన కమిట్మెంట్ను చాటుకుంటున్న ఆయన, #Mega158 కోసం కూడా అదే స్థాయి అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదే కమిట్మెంట్… ఇదే మెగాస్టార్ మ్యాజిక్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. #Mega158పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఇలాంటి వార్తలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రానికి బాబీ కొల్లు దర్శకత్వం వహిస్తుండగా.. మళయాల నటి అనశ్వర రాజన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

