Aishwarya Rajesh | ఐశ్వర్య.. అలా అనడం వలనే ఇలా జరిగిందా..?

Aishwarya Rajesh | ఐశ్వర్య.. అలా అనడం వలనే ఇలా జరిగిందా..?
Aishwarya Rajesh | ఐశ్వర్య రాజేష్‌కు అవకాశాలపై స్పందన
టాలీవుడ్లో అవకాశాల కొరతపై ఆవేదన
నాగార్జున 100వ సినిమాలో ఛాన్స్ టాక్
కెరీర్‌పై క్లారిటీతో ఐశ్వర్య నిర్ణయాలు
Aishwarya Rajesh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐశ్వర్య రాజేష్.. మంచి నటి. పాత్రకు తగ్గట్టుగా నటిస్తుంది. ఆ పాత్ర తప్పితే ఆమె కనపడకుండా ఉండాలి అనుకుంటుంది. అలా నటించడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే.. తెలుగు అమ్మాయి అయిన ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో తెలుగులో అవకాశాలు రాలేదనే బాధ ఆమెలో ఉంది. సంక్రాంతికి వస్తున్నాం అనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లో నటించిన తర్వాత కూడా తెలుగు నుంచి ఆఫర్స్ రాలేదనే బాధ వ్యక్తం చేసింది. అయితే.. ఇప్పుడు ఐశ్యర్యకు అదిరిపోయే ఆఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఐశ్వర్యకు వచ్చిన ఆఫర్ ఏంటి..?
Aishwarya Rajesh | ఆఫర్లు లేవనే భావన..
ఐశ్వర్య రాజేష్ గురించి చెప్పాలంటే.. దక్షిణ భారత సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి. తాను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉండాలని భావిస్తానని ఐశ్వర్య రాజేష్ పేర్కొంది. కేవలం ఆఫర్లు వస్తున్నాయనే కారణంతో సినిమాలు ఒప్పుకోనని, పాత్రలో బలం, కథలో అర్థం ఉండాలి అని ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చెప్పింది. కొన్నిసార్లు మంచి కథలు రాకపోవడం వల్ల గ్యాప్ వస్తుందని, అది ఆఫర్లు లేవనే భావనను కలిగిస్తుందని చెప్పింది.
సినీ పరిశ్రమలో పోటీ ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరికీ అన్ని సమయాల్లో అవకాశాలు రావని, అయితే తనకు నచ్చిన పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని ఆమె తెలిపింది. అయితే.. తెలుగు అమ్మాయి అయిన తనకు తెలుగులో సంక్రాంతికి వస్తున్నాం అనే బ్లాక్ బస్టర్ మూవీలో నటించిన తర్వాత కూడా చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదని బాధపడింది.

Aishwarya Rajesh | నాగ్ 100లో ఐశ్వర్య..?
అలా బాధ పడడం వలనో ఏమో కానీ.. ఇప్పుడు ఈ అమ్మడికి టాలీవుడ్ కింగ్ నాగార్జున 100వ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. నాగార్జున తన 100వ సినిమాను చాలా సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు నటిస్తుంది. సుస్మిత భట్ అనే మరో హీరోయిన్ కూడా నటిస్తుంది. అయితే.. మరో ముఖ్యమైన పాత్ర కోసం ఐశ్వర్య రాజేషన్ ని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ఐశ్వర్యకు లక్కీ ఛాన్స్ అని చెప్పచ్చు. కొత్త కొత్త పాత్రలతో మెప్పించాలని తపిస్తున్న ఐశ్వర్య ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

Aishwarya Rajesh | ఏ భాషలోనైనా నటించడానికి రెడీ..
ప్రేక్షకులు తనను మంచి కథలతో చూడాలని ఆశపడుతున్నారని, అందుకే తొందరపడి సినిమాలు చేయకుండా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నానని ఐశ్వర్య రాజేష్ చెప్పింది. మంచి స్క్రిప్ట్ వస్తే.. ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. మొత్తానికి కెరీర్ పట్ల.. తన సినిమాల పట్ల ఫుల్ క్లారిటీతో ఉంది. సీనియర్ హీరో వెంకీతో జత కట్టి బ్లాక్ బస్టర్ సాధించిన ఐశ్వర్య.. ఇప్పుడు మరో సీనియర్ హీరో నాగార్జునతో జత కట్టబోతుండడం విశేషం. మరి.. ఇక నుంచైనా ఐశ్వర్యకు తెలుగులో ఆశించిన ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

