ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు…
ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు…
పాయకాపురం, ఆంధ్రప్రభ : స్థానిక విజయవాడ సెంట్రల్ శివారు ప్రాంతమైన సింగ్ నగర్ రామా నగర్లోని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం హనుమాన్ 88వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు,కమిటీ అధ్యక్షుడు దొంతరాజు బాబూరావు పాల్గొని స్వామికి పూజలు నిర్వహించారు. ఉదయం నుండి స్వామికి అభిషేకాలు,108సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులు విష్ణు, సాయి, యదునందనరావు,తదితరులు పాల్గొన్నారు.
