వైస్ జగన్‌కు ఆత్మీయ స్వాగతం..

వైస్ జగన్‌కు ఆత్మీయ స్వాగతం..
విమానాశ్రయంలో పార్టీ నేతల మర్యాదపూర్వక భేటీ..
డాక్టర్ మెహబూబ్ షేక్‌తో ప్రత్యేకంగా ముచ్చటించిన జగన్..
వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం
విజయవాడ, ఆంధ్రప్రభ : విదేశీ పర్యటన ముగించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్ఈసీ సభ్యులు, పార్టీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మెహబూబ్ షేక్ మర్యాదపూర్వకంగా జగన్‌ను కలిశారు.
ఈ సందర్భంగా డాక్టర్ మెహబూబ్ షేక్‌ను జగన్ ఆప్యాయంగా పలకరించి కొద్దిసేపు పలు అంశాలపై ముచ్చటించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నాయకులతో జగన్ భేటీ కావడం, పర్యటన అనంతరం రాష్ట్రానికి చేరుకోవడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గన్నవరం విమానాశ్రయం వద్ద నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
