NEET UG-2026 | ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో ఎన్టీయే కీలక నిర్ణయం

NEET UG-2026 | ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో ఎన్టీయే కీలక నిర్ణయం
NEET UG-2026 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనకు దారితీసింది.
ఈనెల 3వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయ్యిందన్న వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం.
పరీక్ష రద్దు నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీయే తెలిపింది. కొత్త పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాత విధానాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు పేర్కొన్నారు.
