7:30a.m. | చిత్తూరు జిల్లాలో దారుణం..విలేకరి దారుణ హత్య!

7:30a.m. | చిత్తూరు జిల్లాలో దారుణం..విలేకరి దారుణ హత్య!
7:30a.m. | వాకింగ్‌కు వెళ్లిన జర్నలిస్టుపై కిరాతక దాడి
అడ్డుకోబోయిన మరో రిపోర్టర్‌కు గాయాలు
జర్నలిస్టు హత్యపై పాత్రికేయ సంఘాల తీవ్ర ఆగ్రహం
నిందితుల అరెస్టుకు డిమాండ్
వి.కోటలో విషాద ఛాయలు
7:30a.m. | వి కోట, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా వి.కోటలో మంగళవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. ప్రజా సమస్యలపై గళమెత్తే ఒక కలం మూగబోయింది. ఆంధ్రజ్యోతి పత్రిక రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు వేటకత్తులతో కిరాతకంగా నరికి చంపారు. పట్టపగలే, నలుగురూ చూస్తుండగానే జరిగిన ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
7:30a.m. | అసలేం జరిగింది?
ప్రతిరోజూ లాగే మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డి తన స్నేహితుడు, ప్రజాశక్తి రిపోర్టర్‌తో కలిసి వాకింగ్‌కు వెళ్లారు. వి.కోట శివారులో వారు నడుచుకుంటూ వెళ్తుండగా, అప్పటికే మాటువేసిన గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా వెనుక నుండి దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి తేరుకునే లోపే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో, ఆయన శరీరమంతా తీవ్ర రక్తస్రావంై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

అడ్డుకోబోయిన మరో రిపోర్టర్‌పై దాడి
జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు ఆయనతో ఉన్న ప్రజాశక్తి రిపోర్టర్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, రెచ్చిపోయిన దుండగులు ఆయనపై కూడా దాడి చేసి గాయపరిచారు. రక్తపు మడుగులో పడి ఉన్న జగన్మోహన్ రెడ్డిని చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జగన్మోహన్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, గాయపడిన మరో విలేకరిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి పంపించారు.
పాత్రికేయ లోకం ఆగ్రహం
జర్నలిస్టుపై జరిగిన ఈ భౌతిక దాడిని పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టే విలేకరులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పాత కక్షలా, లేక వృత్తిపరమైన కారణాల వల్ల ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
నిందితులను కఠినంగా శిక్షించాలన్న జర్నలిస్టు సంఘాల డిమాండ్
పట్టపగలే అత్యంత దారుణంగా హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే గుర్తించి, అరెస్ట్ చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విలేకరులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి మరణంతో వి.కోటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక నిబద్ధత కలిగిన రిపోర్టర్‌ను కోల్పోవడం పట్ల తోటి విలేకరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
click here to read ఇద్దరు పసిబిడ్డలను పొట్టనబెట్టుకుని.. తాను కూడా……
