Kurnool | మెడికల్‌ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కర్నూలు : కర్నూలు మెడికల్‌ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శనివారం ఉదయం జరిగింది. ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాలలోని వసతి గృహంలో ఈరోజు ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

గమనించిన తోటి విద్యార్థులు వెంటనే యాజమాన్యానికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆమెను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, ఐసియు లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *