with2children |ఇద్దరు పసిబిడ్డలను పొట్టనబెట్టుకుని.. తాను కూడా……

with2children |ఇద్దరు పసిబిడ్డలను పొట్టనబెట్టుకుని.. తాను కూడా…

with2children |గుండెల్ని పిండేసిన కన్నతండ్రి ఘాతుకం
కుటుంబ కలహాలతో తీసుకున్న దారుణ నిర్ణయం
విషాదంలో మునిగిన అమ్మాపురం గ్రామం
ఘటనపై పోలీసుల దర్యాప్తు ప్రారంభం
చిన్న గొడవలు.. పెద్ద ప్రాణనష్టం

with2children | తొర్రూరు, ఆంధ్రప్రభ: క్షణికావేశం.. అభం శుభం తెలియని ఇద్దరు పసిప్రాణాలను బలితీసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిగా మారి, బిడ్డల ఉసురు తీసి తాను కూడా బలవన్మరణానికి పాల్పడిన ఘటన తొర్రూరు మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది.

with2children | గుండెల్ని పిండేసే ఘటన

మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుమ్ షావలి (35), తన ఇద్దరు కుమారులు విలష్ (5), వికేష్ (3) లతో కలిసి మంగళవారం తొర్రూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపానికి చేరుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన షావలి, దారుణమైన నిర్ణయం తీసుకున్నారు.

with2children
with2children

మొదట తన ఇద్దరు కుమారులను ఉరివేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. కన్నతండ్రి చేతుల్లోనే ఆ పసిబిడ్డలు విగతజీవులుగా మారడం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. బిడ్డలు మరణించిన అనంతరం, షావలి కూడా అదే చోట ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.

విషాదంలో అమ్మాపురం గ్రామం

ఆటపాటలతో సందడి చేయాల్సిన ఆ చిన్నారులు, తండ్రి తీసుకున్న తొందరపాటు నిర్ణయానికి బలవ్వడం స్థానికులను కలచివేసింది. మృతదేహాలను చూసిన స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఐదేళ్ల విలష్, మూడేళ్ల వికేష్ మృతదేహాలు పడి ఉన్న తీరు చూసి అమ్మాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కుటుంబ కలహాలు ఎంతటి వినాశనానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

రంగంలోకి పోలీసులు

విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఆ తండ్రి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేమిటి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

చిన్న చిన్న గొడవలకు నిండు ప్రాణాలను బలిచేసుకోవడమే కాకుండా, లోకం తెలియని బిడ్డలను కూడా బలితీసుకోవడం పట్ల సామాజిక వర్గాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.

click here to read more

click here to read జాతీయ రహదారిపై ప్రమాదం

Leave a Reply