80hippos | మూగజీవాల కోసం ముందుకొచ్చిన అనంత్ అంబానీ

80hippos | మూగజీవాల కోసం ముందుకొచ్చిన అనంత్ అంబానీ
80hippos | కొలంబియాలో హిప్పోలపై మరణశిక్ష నిర్ణయం
వంతార ద్వారా జంతు సంరక్షణలో అనంత్ అంబానీ సేవలు
“చంపొద్దు” అంటూ ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి
ఖర్చంతా భరిస్తానంటూ అనంత్ అంబానీ హామీ
80hippos |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భూమి మీద మనిషికే కాదు, ప్రతి జీవికి బతికే హక్కు ఉంది. కానీ.. మనుషులు చేసిన తప్పులకు మూగజీవులు ప్రాణాలు వదలాలా? పర్యావరణానికి ముప్పుగా మారాయనే ఒకే ఒక కారణంతో.. ఏ పాపమెరుగని 80 నీటి ఏనుగులను (హిప్పోపొటమస్) చంపేయాలని కొలంబియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ ఒకప్పుడు పెంచుకుని వదిలేసిన ఆ హిప్పోల సంతతి ఇప్పుడు పెరిగిపోయి, మరణశిక్షకు గురవుతున్న సమయంలో ఒక ఆపద్బాంధవుడు ముందుకొచ్చాడు. ఆయనే రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసుడు, వన్యప్రాణి ప్రేమికుడు అనంత్ అంబానీ.
80hippos | చలించిపోయిన జంతు ప్రేమికుడు…
తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వంతార’ ద్వారా ఇప్పటికే వేలాది అభాగ్య, గాయపడిన వన్యప్రాణులకు పునర్జన్మ ఇస్తున్న అనంత్ అంబానీ.. కొలంబియాలోని హిప్పోల దీనస్థితి చూసి చలించిపోయారు. ప్రాణాలు తీయడానికి మనం ఎవరమంటూ.. “దయచేసి ఆ మూగజీవాలను చంపొద్దు, వాటిని కాపాడుకునే బాధ్యత నాది” అంటూ నేరుగా ఆ దేశ ప్రభుత్వం వద్దకే ఒక ప్రతిపాదన పంపారు.
ఖర్చెంతైనా భరించేందుకు సిద్ధం..
ఆ 80 హిప్పోలను రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు లేదా భారత్లోని జామ్నగర్లో ఉన్న తన ‘వంతార’ జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చేందుకు ఎంత ఖర్చయినా సరే, మొత్తం తానే భరిస్తానని అనంత్ అంబానీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక జంతువు ప్రాణం కాపాడటం కోసం ఖండాంతరాల అవతల ఉన్న దేశానికి సాయం అందించేందుకు ఆయన చూపించిన చొరవ నిజంగా అద్భుతం. సరిహద్దులతో సంబంధం లేకుండా, ఆర్తనాదాలు చేసే ప్రతి జీవికీ అండగా నిలబడాలన్న అనంత్ అంబానీ దయార్ద్ర హృదయంపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. నిజమైన సంపద అంటే కోట్లు కూడబెట్టడం కాదు.. ప్రాణాపాయంలో ఉన్న మూగజీవాలను కాపాడే కరుణ అని ఆయన మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు.

click here to read Prime Minister | రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
