62devotees | కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రుల్లో చికిత్స

62devotees | కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రుల్లో చికిత్స

62devotees | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌ : ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా సిమౌపూర్ గ్రామంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదంగా మారింది. కార్యక్రమంలో ప్రసాదం తిన్న 62 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సిమౌపూర్ గ్రామానికి చెందిన మున్నాలాల్ కశ్యప్ తన ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం బంధువులు, సన్నిహితులకు ప్రసాదం పంపిణీ చేశారు. అయితే కొన్ని గంటల తర్వాత ప్రసాదం తిన్న వారిలో అస్వస్థత లక్షణాలు కనిపించాయి.

మొదట స్థానిక క్లినిక్‌లలో ప్రథమ చికిత్స అందించినప్పటికీ, బాధితుల సంఖ్య పెరగడంతో వారిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం 62 మందికి చికిత్స కొనసాగుతోందని, వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారులు తెలిపారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టి, ప్రసాదం నమూనాలను పరీక్షల కోసం సేకరించారు.

Leave a Reply