57kilometers | నైరుతి .. ఆగమనం
57kilometers | నైరుతి .. ఆగమనం
57kilometers | ఇప్పటికే లక్షద్వీప్‌ను తాకిన రుతుపవనాలు
జూన్ ఒకటో తేదీ నుంచి ఏపీ, తెలంగాణలో వానలు
వరుసగా మూడు రోజులు కురిసే అవకాశం
జూన్ తొలి వారం నుంచి ఎండలు తగ్గుముఖం
57kilometers | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రాబోయే మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతం, లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని భాగాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కొద్దిగా జోరు పెంచాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంటార్కిటికా, ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతాల నుంచి వస్తున్న గాలి ప్రవాహాలు ఈ రుతుపవనాలను ఇండియా వైపు వేగంగా నెడుతున్నాయి. లక్షద్వీప్, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి రాబోయే రెండు మూడు రోజుల్లో విస్తరించే ఛాన్స్ ఉంది. మే 31 లేదా జూన్ 1వ తేదీ కల్లా రుతుపవనాలు కేరళను తాకొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.
సడెన్ ట్విస్టులు
ప్రస్తుతం సముద్రంలో జరుగుతున్న మార్పుల వల్లే ఈ సడెన్ ట్విస్టులు కనిపిస్తున్నాయి. తమిళనాడు తీరాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. దీనివల్ల సముద్ర మట్టానికి దాదాపు 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు భారీగా మేఘాలు పేరుకుపోయాయి. అటు ఆగ్నేయ అరేబియా సముద్రంలో కూడా మరో ఆవర్తనం యాక్టివ్‌గా ఉంది. వీటికి తోడు తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో మూడో ఆవర్తనం కూడా తోడైంది. దీని ప్రభావం వల్ల మేఘాలు ఏకంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించాయి. ఉత్తరాంధ్ర మీదుగా ఉన్న మరో ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో చేరింది. ఇది కనుక మరింత బలపడితే అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో గంటకు 57 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
అక్కడక్కడా జల్లులు
ఇక నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరంపై సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక స్థిరమైన ఉపరితల వాయు ప్రసరణ వ్యవస్థ విస్తరించి ఉండటం వల్ల, ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాబోయే మూడు రోజుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం కూడా ఉంది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీయవచ్చు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే అంచనా వేసింది వాతావరణ శాఖ. అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా మారే అవకాశం లేనప్పటికీ 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు రెండు వారాల పాటు కొనసాగిన తీవ్రమైన ఎండల తర్వాత ఆదివారం నుండి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయని భారత వాతావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపాయి.
తగ్గుముఖం పడుతున్న ఉష్ణోగ్రతలు
శుక్రవారం నాడు 10 జిల్లాల్లోని 51 మండలాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలోని కొమ్మిపాడు వద్ద అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి వద్ద 44.6 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని, విజయనగరం జిల్లాలోని రాజం వద్ద 43.9 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలోని కరేడు, తిరుపతి జిల్లాలోని వెంకటగిరి వద్ద 43.8 డిగ్రీలు; అలాగే శ్రీకాకుళం జిల్లాలోని లక్ష్మీనరసుపేట వద్ద 43 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణాలోనూ..
నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు, చుట్టుపక్కల ప్రాంతాలకు మరింతగా విస్తరించే అవకాశం ఉంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఇంకా ఉంది. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతాయని అంచనా. అయితే తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఉండవచ్చు. నైరుతీ రుతుపవనాలు.. లక్షద్వీప్, ఆగ్నేయ, నైరుతీ అరేబియా సముద్రం, నైరుతీ, తూర్పు, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాలకు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు వచ్చే రెండు, మూడు రోజుల్లో విస్తరించడానికి అనుకూలమైన అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.
