IND vs ENG | ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై గిల్ విజృంభ‌ణ‌.. చరిత్ర సృష్టించిన యువ కెప్టెన్ !

  • టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన మైలురాయి

ఎడ్జ్‌బాస్టన్ : బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో చరిత్రలో తన పేరు చిరస్థాయిగా లిఖించుకున్నాడు. ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన రెండవ భారత ఆటగాడు, రెండవ టెస్ట్ కెప్టెన్ గిల్ ఘ‌న‌త సాధించాడు.

కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన డ‌బుల్ సెంచ‌రీ సాధించి 269 పరుగులతో విజృంభించ‌గా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా గిల్ అదే ధాటిని కొనసాగించాడు. కేవలం 129 బంతుల్లోనే తన 8వ టెస్టు శతకాన్ని (100*) పూర్తి చేశాడు. ఈ శతకం గిల్‌కు ఇంగ్లాండ్‌పై ఐదవది కావడం గమనార్హం.

దిగ్గజాల సరసన యువ కెప్టెన్ – శుభ్‌మన్ గిల్!

తన కెప్టెన్సీ అరంగేట్రంలోనే శుభ్‌మాన్ గిల్ రికార్డులు తిర‌గ‌రాస్తూ చ‌రిత్ర సృష్టిస్తున్నాడు. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుత‌న్న రెండో టెస్ట్‌లో అతను 269 పరుగులు (మొద‌టి ఇన్నింగ్స్) + 100 (రెండో ఇన్నింగ్స్)తో ప‌లు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించాడు:

ఒకే టెస్టులో డబుల్ సెంచరీ + సెంచరీ:

సునీల్ గవాస్కర్ – 124 & 220 vs వెస్టిండీస్ (1971)
శుభ్‌మన్ గిల్ – 269 & 100* vs ఇంగ్లాండ్ (2025)
అయితే, ఇంగ్లాండ్‌పై ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా గిల్ మ‌రో రికార్డ్ సృష్టించాడు.

ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన మూడవ భారత కెప్టెన్:

గవాస్కర్ – 1978 (కోల్‌కతా)
విరాట్ కోహ్లీ – 2014 (అడిలైడ్)
శుభ్‌మన్ గిల్ – 2025 (ఎడ్జ్‌బాస్టన్)

కెప్టెన్‌గా మొదటి రెండు టెస్టుల్లో అత్యధిక సెంచరీలు:

విరాట్ కోహ్లీ, గిల్ – 3 సెంచరీలు
విజయ్ హజారే, గవాస్కర్, స్టీవ్ స్మిత్ – 2 సెంచరీలు

కెప్టెన్‌గా మొదటి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు:

  1. 524 – శుభ్‌మన్ గిల్*
  2. 458 – మర్వన్ అతపట్టు
  3. 449 – విరాట్ కోహ్లీ
  4. 429 – సునీల్ గవాస్కర్
  5. 393 – గ్రేమ్ స్మిత్

Leave a Reply