శ్రీ సీతారాముల కళ్యాణంనకు ఏర్పాట్లు…

శ్రీ సీతారాముల కళ్యాణంనకు ఏర్పాట్లు…
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 3వ వార్డు లింగోజిగూడెం గ్రామంలో శ్రీ శివమహదేవ ఆలయం కమిటీ చైర్మన్ బండమీది ఎల్లయ్య, ధర్మకర్తలు బోసి అన్నపూర్ణ, బాతరాజు యాదయ్య, మాందూరి నరేష్, చెరుకు సాయిరాం ల ఆధ్వర్యంలో శ్రీరామనవమి ని పురస్కరించుకొని ఆదివారం దేవాలయం ప్రాంగణంలో స్థానిక వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో పండితులు శ్రీ సీతారాముల కళ్యాణం నకు సంబంధించి లగ్న ప్రతికను రాశారు.
ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పర్నె శివారెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, మాజీ సర్పంచ్ ఊదరి నరసింహ, నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తొర్పునూరి శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బండమీది వెంకటేష్, మాజీ అధ్యక్షులు ఎర్రగోని లింగస్వామి యాదవ్, బాతరాజు అంజయ్య, బండారి ప్రవీణ్, ఎర్రగోని కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
