కన్నాయిగూడెం పాఠశాలల్లో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీలు
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వత్సల్ టోప్పో, ఐఏఎస్ కన్నాయిగూడెం మండలంలోని ఆశ్రమ హైస్కూల్ బాలుర పాఠశాల, గంగుగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠ్యపుస్తకాల పంపిణీ, తాగునీటి సౌకర్యం, ఆర్ఓ ప్లాంట్, వంటగది, వసతి గృహాలు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన, పఠన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. పోషకాహారం, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు మెరుగుపరచడంతో పాటు బడిబాట కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆదేశించారు.
