దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
- ఎమ్మెల్యే సామెల్
మోత్కూర్, ఆంధ్రప్రభ: దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. సోమవారం మండలంలోని పాటిమట్ల ఎస్సి కాలనీలో కాలనీవాసులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే సామేల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాటిమట్ల గ్రామంలో ఈ నెల 23 ,24 తేదీలలో పెద్ద మైసమ్మ పండుగ చేయడానికి నిర్ణయించినందున పాటిమట్ల గ్రామంలోని దళితవాడకి విచ్చేసి కుల పెద్ద మనుషులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
మండలంలోనే పాటిమట్ల గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందు ఉంచుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎస్సీ ర్భంగా ఎమ్మెల్యే ను కుల పెద్దలు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బండ రమ విజయ్ రెడ్డి, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో బాలాజీ నాయక్, సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు,దళిత కాలనీ కుల పెద్దలు, మహిళలు, యువకులు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.కులానికి చెందిన రైతులకు ప్రత్యేకంగా ఒక ట్రాన్స్ ఫార్మర్ ఇప్పించి, లూజ్ లైన్ క్రింద 6 విద్యుత్ స్తంభాలు మంజూరి చేయించాలని, పాటిమట్ల గ్రామం నుండి ఎక్స్ రోడ్ వరకు చెరువు కట్ట కింద సల్లోని భావి, కుమ్మరి బావి ల వద్ద మెయిన్ రోడ్డు వెంట రక్షణ గోడలు నిర్మించాలని , ఇందిరమ్మ ఇళ్లలో దళితులకు క్రైటీరియా ప్రకారం ఎక్కువ శాతం ఇండ్లు మంజూరు చేయించాలని, ఎస్సీ కమ్యూనిటీ హాల్ త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించాలని, సదర్శాపురం రోడ్ కు బృందావన్ కాలువ మీద కల్వర్టు నిర్మించాలని గ్రామస్తుల తరఫున స్థానికుడు కురిమేటి యాదయ్య ఎమ్మెల్యే సామెల్ కి స్థానిక సమస్యలను వ్రాతపూర్వకంగా రాసి చదివి వినిపించారు.అనంతరం వినతిపత్రంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తక్షణమే సంబంధిత పనులను ప్రాధాన్యత క్రమంలో అధికారులతో పరిశీలించి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను కుల పెద్దలు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బండ రమ విజయ్ రెడ్డి, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో బాలాజీ నాయక్, సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు,దళిత కాలనీ కుల పెద్దలు, మహిళలు, యువకులు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
