అగ్నివీర్‌కు శిక్షణకు వెళ్తున్నయువకుడికి ఘన సన్మానం.
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అవుసలోనిపల్లి గ్రామానికి చెందిన అనంతమ్మ రాములు దంపతుల కుమారుడు సతీష్ కుమార్ అగ్నివీర్‌కు వెళుతుండడంతో సర్పంచ్ ఎల్లమ్మ తిమ్మయ్య, తో పాటు పలువురు ఘనంగా సన్మానించివీడ్కోలుపలికారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎల్లమ్మ తిమ్మయ్య మాట్లాడుతూ దేశ సేవ చేసేందుకు ఎంతో కష్టపడి యువకుడు అగ్నివీర్ ఎంపికయ్యారని యువకులు , విద్యార్థులు సతీష్ కుమార్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అగ్నివీర్‌గా ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణమని, ఆయనను ఆదర్శంగా తీసుకుని మరింత మంది యువత దేశ సేవ దిశగా ముందుకు రావాలని ఆకాంక్షించారు. కృషి పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చని యువకుడు సతీష్ కుమార్ నిరూపించాడని శిక్షణ విజయవంతం చేసుకుని తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
