8 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాము అనిత ప్రచారం..

8 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాము అనిత ప్రచారం..
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 8 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాము అనిత ఇంటింటి ప్రచారాన్ని ఆదివారం నిర్వహించారు. మహిళలను, ఓటర్లను కలుసుకొని తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి మద్దతు పలకాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
