PM MODI | ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
PM MODI | ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరు
సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని..
PM MODI | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక పర్యటనలో భాగంగా శనివారం సీషెల్స్ రాజధాని విక్టోరియాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు జూన్ 27 నుంచి 29 వరకు ఆయన ఈ దేశంలో పర్యటించనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీషెల్స్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించే తొలి భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. అలాగే ప్రధాని మోదీ, అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో సమావేశమై రక్షణ, సముద్ర భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీషెల్స్ స్వర్ణోత్సవ వేడుకల్లో భారత రక్షణ దళాల ప్రతినిధి బృందంతో పాటు భారత నౌకాదళానికి చెందిన రెండు యుద్ధ నౌకలు కూడా పాల్గొంటున్నాయి. భారత్–సీషెల్స్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
