Railway Smoking Fine | జ‌రిమానా, జైలు.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌

రైళ్లలో ధూమపానంపై ఇక కఠిన చర్యలు
జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమలు..
రూ.2,000 జరిమానాతో పాటు టికెట్ రద్దు,
జైలు శిక్షకూ అవకాశం

*కేంద్ర ప్రభుత్వం ‘జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) చట్టం-2026’ కింద రైల్వే నిబంధనలను కఠినతరం చేసింది.
*జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
*రైళ్లలో ధూమపానం చేస్తే రూ.100 స్థానంలో రూ.2,000 జరిమానా విధించనున్నారు.
*అవసరమైతే టికెట్ రద్దు చేసి తదుపరి స్టేషన్‌లో దింపివేసే అధికారం అధికారులకు ఉంటుంది.
*జరిమానా చెల్లించని వారిపై కేసు నమోదు చేసి రైల్వే కోర్టుకు హాజరుపర్చడంతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
*రైళ్లలో ధూమపానం, రిజర్వ్‌డ్ బెర్తుల ఆక్రమణ, టికెట్ లేకుండా ప్రయాణం, అనధికార విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
*జరిమానాలను స్పాట్‌లోనే వసూలు చేసే అధికారాన్ని రైల్వే సిబ్బందికి కల్పించారు.
*నిబంధనలతో ప్రయాణికుల భద్రత, పరిశుభ్రత, క్రమశిక్షణ మెరుగుపడడంతో పాటు మహిళలకు మరింత సురక్షిత వాతావరణం *కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.

మ‌రికొన్ని నిబంధ‌న‌లు

  • టికెట్ లేకుండా లేదా చెల్లని టికెట్‌తో ప్రయాణిస్తే కనీసం రూ.500 అదనపు ఛార్జీ. (సెక్షన్ 137)
  • ఇతరుల టికెట్‌తో ప్రయాణిస్తే టికెట్ స్వాధీనం చేసుకుని రూ.500 అదనపు ఛార్జీ. (సెక్షన్ 142)
    *మహిళల కోచ్‌లో పురుషులు ప్రయాణించినా, రిజర్వ్‌డ్ సీట్లను అనధికారికంగా ఆక్రమించినా రూ.2,500 వరకు జరిమానా. (సెక్షన్ 162)
    *ప్రమాదకర లేదా నిషేధిత వస్తువులు తీసుకెళ్తే రూ.10,000 వరకు జరిమానా. (సెక్షన్ 165)
    *రైళ్లలో బిక్షాటన చేయడం లేదా అనధికారికంగా వస్తువులు విక్రయిస్తే రూ.2,000 వరకు జరిమానా. (సెక్షన్ 144)
    *రైళ్లలో మద్యం సేవించడం, ఉమ్మివేయడం, గందరగోళం సృష్టించడం వంటి చర్యలకు రూ.1,000 జరిమానా. తప్పు పునరావృతమైతే *రూ.5,000 వరకు జరిమానా. (సెక్షన్ 145)
    *జరిమానా చెల్లించని వారిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.