ముగిసిన త్రిదిన యజ్ఞ పూజలు.
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం గూడెం గోదావరి నదీతీరాన ఉన్న శ్రీ స్వయంభూ శనేశ్వర ఆలయంలో త్రిదిన యజ్ఞ పూజలు ముగిశాయి.చివరి రోజైన శనివారం ప్రత్యేక హోమము, గణపతి పూజ, నవగ్రహ అభిషేకం, మహా పూర్ణాహుతి, పూజలను ఆలయ వ్యవస్థాపకుడు భాను తేజస్వామి అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా నుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
