Jalna Yelahanka | రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్
Jalna Yelahanka | రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్
జాల్నా–యలహంక మధ్య వీక్లీ ట్రెయిన్స్
జూన్ 28 నుంచి జూలై 27 వరకు సేవలు..
తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో హాల్ట్
Jalna Yelahanka | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే జాల్నా–యలహంక మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 07601/07602 నంబర్లతో ఈ ప్రత్యేక రైళ్లు జూన్ 28 నుంచి జూలై 27 వరకు వారానికి ఒకసారి రాకపోకలు సాగించనున్నాయి. ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లతో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ముఖ్య స్టేషన్లలో ఆగనున్నాయి. తెలంగాణలో నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, బొల్లారం, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు స్టేషన్లలో హాల్ట్ ఉంటుంది.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. మార్గమధ్యంలో జాల్నా, నాందేడ్, ముద్ఖేడ్, బాసర వంటి ముఖ్య స్టేషన్లలో కూడా నిలుస్తుంది. రైళ్ల సమయాలు, టికెట్ బుకింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను భారతీయ రైల్వే అధికారిక బుకింగ్ వేదిక ఐఆర్సీటీసీలో లేదా సమీప రైల్వే విచారణ కేంద్రాల్లో తెలుసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
