Rohit Reddy | ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ వేగం..

Rohit Reddy | ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ వేగం..

Rohit Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. రెండు రోజుల పాటు ప్రియాంక రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. బ్యాగులోని నగదు గురించి ప్రియాంకను ఆరా తీశారు. కాగా, నోటీసులు ఇచ్చి పంపించిన ఏడుగురిలో నలుగురిని ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలపై సిట్ అధికారులు దృష్టి సారించి ఆరా తీస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనల్లో పాల్గొన్నారా అనే కోణంలో కూడా వారిని ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే ఐదు రోజులుగా కౌశిక్ రవి, అర్జున్, శ్రావణ్‌లను అధికారులు విచారిస్తున్నారు. కాగా రేపు రోహిత్, రితేష్, నమిత్ శర్మ కస్టడీపై కోర్టు తీర్పు ఇవ్వనుంది.