2countries | ప్రపంచాన్ని షాక్ కి గురి చేసిన నిజాలు.. !
2countries | ప్రపంచాన్ని షాక్ కి గురి చేసిన నిజాలు.. !
2countries | నేపథ్యం: ఒక నదీ వ్యవస్థ విభజన
చర్చలు – హేతుబద్ధంగా వ్యవహరించినందుకు భారతదేశం చెల్లించిన మూల్యం
భారతదేశం కోల్పోయినది ఏమిటి: త్యాగం విస్తృతి
ఒప్పందం యొక్క రూపకల్పనలో ఉన్న అసమానత
పాకిస్థాన్ ద్వారా ఒప్పందం ఆయుధీకరణ
భారతదేశం ఎదుర్కొన్న పర్యవసానాలు
భారతదేశం వాదన
ముగింపు: సద్భావనకు ప్రతిఫలం ద్రోహమా?
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
- పాకిస్థాన్ ద్వారా ఒప్పందం ఆయుధీకరణ భారతదేశ అభివృద్ధికి పద్ధతి ప్రకారం అవరోధం…
ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుండి, పాకిస్థాన్ తన వివాద పరిష్కార ఏర్పాట్లను నిజమైన వివాద పరిష్కారం కోసం ఉపయోగించడానికి బదులుగా అభివృద్ధిని ఆలస్యం చేయడానికి, సమర్థవంతంగా అడ్డుకోవడానికి ఒక వ్యూహాత్మక సాధనంగా నిరంతరం ఉపయోగించింది. ఒప్పందం నిబంధనల ప్రకారం స్పష్టంగా అనుమతించబడిన వాటితో సహా భారతదేశం పశ్చిమ నదులపై ప్రతిపాదించిన దాదాపుగా ప్రతి జలవిద్యుత్ ప్రాజెక్ట్ పై పాకిస్థాన్ నుండి అభ్యంతరం, సాంకేతిక సవాలు ఎదురైంది లేదా మధ్యవర్తిత్వం కోసం సూచించబడింది.
బాగ్లిహార్, కిషన్గంగా, పాకాల్ దుల్, తుల్బుల్ వంటి ప్రాజెక్టుల పట్ల పాకిస్థాన్ దీర్ఘకాలంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. అనేక సందర్భాల్లో, వరద నియంత్రణతో సహా నియంత్రిత నీటి ప్రవాహం కోసం భారతీయ ప్రాజెక్టుల వలన కలిగే ప్రయోజనాలను పాకిస్థాన్ అంగీకరించింది. అదే సమయంలో వాటిని వ్యతిరేకించింది. పాకిస్థాన్ వ్యక్తపరిచే ఈ అభ్యంతరాలు అన్నీ ఒప్పంద నియమాల పట్ల సమ్మతి గురించి కాదు అని ఇటువంటి చర్యలు వెల్లడిస్తున్నాయి. చట్టపరమైన యోగ్యతతో సంబంధం లేకుండా జమ్ము కశ్మీర్లో భారతదేశం యొక్క అభివృద్ధి కార్యక్రమాలను నిరోధించడానికి చేపట్టిన చర్యలుగా అర్థం అవుతుంది.
‘నీటి యుద్ధం’ అనే కథ, దాని ప్రచారం…
అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ‘నీటి దురాక్రమణదారు’ గా చిత్రీకరించే విధంగా ఒక వివరణను రూపొందించడానికి, ప్రచారం చేయడానికి భారతదేశం నిరంతర సమ్మతిని పాకిస్థాన్ దుర్వినియోగం చేసింది. భారతదేశం కచ్చితంగా అనుసరిస్తున్న అదే ఒప్పందాన్నిపేర్కొంటూ భారతదేశం ‘నీటి ఆయుధీకరణ’ చేస్తుంది అనే ఆరోపణను పాకిస్థాన్ అధికారులు, విద్యావేత్తలు, దౌత్యమార్గాల ద్వారా పలుమార్లు చేసింది.
నదీ పరీవాహక ప్రాంతం ఎగువన కలిగిన దేశాన్ని ఒక ప్రమాదంగా చూపుతూ చేసిన ఈ వర్ణన, ఒప్పందం, చరిత్ర తెలియని అంతర్జాతీయ సమాజంపై ప్రభావంచూపింది. దౌత్య ఒత్తిడిని సృష్టించడానికి, బహుపాక్షిక సహానుభూతిని ఆకర్షించడానికి తన చట్టబద్ధమైన ఒప్పంద హక్కులను అమలు చేయగలిగే భారతదేశం యొక్క సామర్థ్యాన్ని నిలువరించడానికి పాకిస్థాన్ దీనిని ఉపయోగించింది.
ఇందులో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, భారతదేశం ఎన్నడూ- 1965 యుద్ధం సమయంలో కానీ, 1971 సమయంలో కానీ, 1999 కార్గిల్ యుద్ధ సమయంలో కానీ ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన ఈ అరవై ఐదు సంవత్సరాలలో ఏ సమయంలోనూ ఈ ఒప్పందంలోని ఏ ఒక్క నియమాన్ని కూడా ఉల్లంఘించకపోవడం. భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రభుత్వం ద్వారా ప్రేరేపించబడుతున్న ఉగ్రవాదాన్ని నిర్వహించడానికి పాకిస్థాన్ తన భూభాగాన్ని ఉపయోగించినప్పటికీ భారతదేశం ఈ సమ్మతిని కొనసాగించింది.
- భారతదేశం ఎదుర్కొన్న పర్యవసానాలు నిరుపయోగంగా ఉన్న అభివృద్ధి సామర్థ్యం..
ఒప్పందం పరిమితుల వలన సింధూ పరీవాహక ప్రాంతంలో భారతదేశం అభివృద్ధికి విఘాతం కలిగించే విధంగా స్పష్టమైన, దీర్ఘకాలిక పర్యవసానాలు ఏర్పడ్డాయి. సాగు చేయగలిగిన రాజస్థాన్లో అనేక ప్రాంతాలు, పంజాబ్ లో కొన్ని ప్రాంతాలు నిర్జలంగా మారాయి. భారీ ఖర్చుతో కూడుకున్న ప్రత్యామ్నాయ నీటి వనరులపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆరు దశాబ్దాలకు పైగా కోల్పోయిన వ్యవసాయ ఉత్పాదకత అంచనా వేయలేని ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది.
అణగదొక్కబడిన జమ్మూకశ్మీర్ హైడ్రోపవర్ సామర్థ్యం
జమ్మూకశ్మీర్ పై ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఈ కేంద్రపాలిత ప్రాంతం పశ్చిమ నదుల పక్కన ఉంది. ఎక్కువగా వినియోగించబడని భారీ జలవిద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒప్పందం డిజైన్ పరిమితులు, పాకిస్థాన్ వ్యవస్థీకృత అభ్యంతరాలు, బహుళ స్థాయిలో దీర్ఘకాలం పాటు సాగే వివాద పరిష్కార యంత్రాంగం వలన కలిగే నష్టాల కారణంగా ఆ సామర్థ్యం వినియోగం ప్రతి దశలోనూ అడ్డంకులను ఎదుర్కొంది. ఈ ఒప్పందాన్ని ఒక ఉమ్మడి ప్రయోజనంగా కాకుండా, తమ స్వంత భూభాగం గుండా ప్రవహించే ప్రకృతి వనరులను తమ ఆర్థిక అభివృద్ధి కోసం వినియోగించకుండా నిరోధించడానికి బయట వ్యక్తుల ద్వారా సృష్టించబడిన ఒక సాధనంగాస్థానిక జనాభా విశ్వసించడం ప్రారంభించింది.
ఇంధన భద్రత పై ప్రభావం..
పశ్చిమ నదుల జలవిద్యుత్ సామర్థ్యాన్ని పూర్తిగా అభివృద్ధి చేయకపోవడం వలన దేశం ఇంధన భద్రతపై నేరుగా ప్రభావం పడింది. అసమానంగా ఉన్న ఈ ఒప్పందంలో భారతదేశం కలిగి ఉన్న పరిమితి
3.భారతదేశం వాదన
“సద్భావం, స్నేహం, స్ఫూర్తి” లో “సింధూ నదీ వ్యవస్థ నీటీ సంపూర్ణ, సంతృప్తికరమైన వినియోగం”ను సాధించడం ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. కానీ ఆ స్ఫూర్తి నేడు లోపించింది. ఒప్పందాలు సమ్మతి అనేది వాటి చట్టబద్దమైన అమలుపై మాత్రమే కాకుండా ఆ ఒప్పందంలో భాగం అయిన అన్ని పక్షాల ద్వారా సదుద్దేశంతో అది అమలు చేయబడినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని తన విదేశాంగ విధానంగా పాకిస్థాన్ కలిగి ఉంది. ఇది 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులు, ఇటీవల ఏప్రిల్ 2025లో జరిగిన పహల్గామ్ దాడికి కారణం అయింది. IWT ని ఆమోదించడానికి భారతదేశం అనుసరించిన మౌలిక కారణాలకు ఇది వ్యతిరేకంగా ఉంది. ద్వైపాక్షిక ఒప్పందాలను సంపూర్ణంగా ఆమోదించాలి. ఇరుదేశాల నడుమ ఉన్న సంబంధాలు యొక్క ప్రాథమిక సూత్రాలను ఒక దేశం ఉల్లంఘించకూడదు, అదే సమయంలో, ఉల్లంఘనలకు పాల్పడుతున్న దేశానికి ప్రయోజనకరంగా ఉండే ఒప్పంద నియమాలను పాటించాలి అనే డిమాండ్‌ను చేయకూడదు. పాకిస్థాన్ దురుద్దేశంతో వ్యవహరించే సమయంలో భారతదేశం ఈ ఒప్పందాన్ని గౌరవించవలసిన అవసరం లేదు. భారతదేశం తీసుకున్న చర్య చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేయబడిన నియమాన్ని ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయ ఒప్పందాలు పరస్పర నిబద్ధతపై ఆధారపడి ఉంటాయి.
ముగింపు…
సింధూ నదీ జలాల ఒప్పందం చాలా కాలం పాటు అంతర్జాతీయ దౌత్యం విజయానికి చిహ్నంగా నిలిచింది. అటువంటి వ్యక్తీకరణ జరిగిన వాస్తవాలను వక్రీకరిస్తుంది అని ఈ వ్యాసం పేర్కొంటుంది. పాకిస్థాన్ యొక్క రాజీలేని ధోరణి ఫలితంగా ఆ దేశానికి రాయితీలు అందించబడ్డాయి. భారతదేశం సుహృద్భావం దుర్వినియోగం చేయబడింది. దీని ఫలితంగా ఆది నుండి అసమానంగా ఉన్న ఒక ఒప్పందం ఏర్పడింది.
అయినప్పటికీ, భారతదేశం 80 శాతం నీటిని అప్పగించింది. ఆ అప్పగింత సౌకర్యార్థం £62 మిలియన్ (ప్రస్తుత విలువలో $2.5 బిలియన్) చెల్లించింది. తన స్వంత భూభాగంలో ఏకపక్ష నిర్వహణ ఆంక్షలను అంగీకరించింది. పాకిస్థాన్ ప్రారంభించిన యుద్ధ సమయాల్లో ఆ దేశం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ అరవై ఐదు సంవత్సరాల పాటు ఈ ఒప్పందాన్ని కఠినంగా అనుసరించింది. ప్రతిఫలంగా, భారతదేశం సద్దుదేశంతో చేసుకున్న ఒప్పందాన్ని పాకిస్థాన్ భారతదేశ అభివృద్ధిని నిరోధించడానికి ఒక సాధనంగా ఉపయోగించుకుంది. భారతదేశంలో అనేక భూభాగాలు శాశ్వత అభివృద్ధికి దూరం అయినప్పటికీ పాకిస్థాన్ వాస్తవాలకు దూరంగా ఉన్న కథనాలతో ఒక ‘నీటి యుద్ధం’ ప్రచారాన్ని అంతర్జాతీయంగా చేపట్టింది.
CLICK HERE TO READ ప్రపంచాన్ని షాక్ కి గురి చేసిన నిజాలు.. !
CLICK HERE TO READ MORE
