14th | ఢిల్లీ నుంచి గల్లీదాకా ఆందోళనలు
14th | ఢిల్లీ నుంచి గల్లీదాకా ఆందోళనలు
రేపు ఇందిరా పార్క్ వద్ద నిరసన ప్రదర్శన
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై ఆందోళన
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామకు డిమాండ్
14th | హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారతదేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు హైదరాబాద్‌లో భారీ నిరసన నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. సోషల్ మీడియా వేదికగా పురుడుపోసుకుని, దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ పార్టీ తెలంగాణ గడ్డపై ఆందోళనకు సిద్ధమైంది. 14వ తేదీన హైదరాబాద్ వేదికగా ఒక భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించబోతున్నట్లు కాక్రోచ్ జనతాపార్టీ ప్రకటించింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా.. దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరసన సాగనుంది. ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో.. ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.
14th | పోలీసుల అనుమతి..

కాక్రోచ్ జనతా పార్టీ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర చేపట్టనున్న ఆందోళనకు పోలీసుల అనమతి లభించింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశ వ్యాప్తంగా భారీ నిరసనలకు కాక్రోచ్ పార్టీ ప్లాన్ చేసింది. ధర్నాకు అనుమతి కోరుతూ వినతి పత్రం ఇవ్వగా.. పోలీసులు అనుమతి ఇచ్చారు. ధర్నాలో 200 మంది యువత పాల్గొననున్నారు. అయితే గత ఆందోళనలను గమనిస్తే ఇందిరా పార్క్ నిరసనలకు పెద్ద ఎత్తున యువత హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
click here to read more : Wedding Muhurtham 2026 | ఈ నెల 19 వ తేది నుంచి 30 వరకు ముహుర్తాలు
