గోపీ మృతి పాత్రికేయ వృత్తికి తీరని లోటు…
- టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ సంతాపం
ఖమ్మం ఆంధ్రప్రభ : సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి కూరాకుల గోపీ మృతి పాత్రికేయ వృత్తికి తీరని లోటని ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ సంతాపం తెలిపింది. మంగళవారం ఉదయం ఆకస్మికంగా అనారోగ్యం పాలైన ఆయన్ను టీడబ్ల్యూజేఎఫ్ నేతల సహకారంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. అత్యవసర చికిత్స అందుతుండగానే బీపీ రికార్డు నమోదు కాకపోవటం, కార్డియాక్ అరెస్ట్, డయాబెటిక్ పేషెంట్ అయిన ఆయనకు కాలికి గాయంతో ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాప్తి చెందటంతో తుదిశ్వాస విడిచారు. గతంలో వివిధ పత్రికలు, చానల్స్ లో రిపోర్టర్‌గా పనిచేశారు.
ప్రస్తుతం జనంసాక్షి దినపత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో ఇన్ చార్జిగా పనిచేస్తున్నారు. నిరంతరం జర్నలిస్టుల సంక్షేమం, సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే గోపీ మృతి తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందని యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, టీబీజేఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, మానుకొండ రవికిరణ్, ఖమ్మం నియోజకవర్గం అధ్యక్ష, కార్యదర్శులు తురగ రాజేంద్రమూర్తి, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మధుశ్రీ, జిల్లా కమిటీ సభ్యులు కొత్త యాకేష్, నూకల రామచంద్ర మూర్తి, కొమిరె నాగేశ్వరరావు, సంతోష్ చక్రవర్తి, కామళ్ల వెంకట్, టీబీజేఏ నాయకులు గణేష్, అర్షద్, గోపి, కిరణ్, తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. గోపీకి భార్య క్రాంతి, ఇద్దరు కుమార్తెలు తేజస్విని, యశస్విని ఉన్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సంతాపం
సీనియర్ జర్నలిస్టు కూరాకుల గోపీ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అడ్ హక్ కమిటీ ఓ ప్రకటనలో సంతాపం తెలిపింది. కమిటీ అధ్యక్షుడు రామచందర్, ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, కార్యదర్శులు రాజశేఖర్, చంద్రశేఖర్, గుడిగే రఘు తదితరులు ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.
