Rain Tragedy | అల్వాల్‌లో హృదయ విదారక ఘటన

Rain Tragedy | అల్వాల్‌లో హృదయ విదారక ఘటన

Rain Tragedy | అల్వాల్, ఆంధ్రప్రభ ; హైదరాబాద్‌లోని అల్వాల్ సర్కిల్ పరిధి కానాజీగూడ టెలికాం కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారుపై భారీ చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి.

వాటిని తొలగించే ప్రయత్నంలో తండ్రి, కూతురు ప్రమాదానికి గురయ్యారు. ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా, ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అదే సమయంలో అక్కడే ఉన్న తల్లి స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.