స్వీయ గణనకు కలెక్టర్ శ్రీకారం చుట్టారు…

స్వీయ గణనకు కలెక్టర్ శ్రీకారం చుట్టారు…
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : స్వీయ గణన కాలపరిమితి ఈ నెల 16 నుండి 30 వరకు ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు . కలెక్టర్ కార్యాలయంలో ఆయన గురువారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరిది వారే వెబ్ సైట్ లో జనగణన 2027 – స్వీయ గణన చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర జనగణన సంచాలకులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జనగణన-2027లో భాగంగా స్వీయ గణన (సెల్ఫ్ – ఎన్యూమరేషన్ ) ప్రక్రియను ఆయన ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వీయ గణనను విజయవంతంగా నిర్వహించారు. స్వీయ గణన సదుపాయం కోసం అధికారిక వెబ్‌సైట్ Se.Census.Gov.In వెబ్ లో చేసుకోవచ్చాన్నారు. స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయడానికి సుమారు 15 నిమిషాలు మాత్రమే పడుతుందన్నారు. ఈ విధానం జనగణనలో తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగిందనారు.
ప్రజలలు స్వయంగా జనగణనలో పాల్గొనే విధంగా చేయడం, ఖచ్చితమైన, సమగ్ర సమాచారం సేకరించడం, ప్రజలకు సులభమైన డిజిటల్ సేవ అందించడం దీని ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లా ప్రజలందరూ నిర్దిష్ట గడువులోపు స్వీయ గణన పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అదనంగా, 15 రోజుల అవుట్‌రీచ్ కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖలు, సంబంధిత అధికారులు ప్రజలకు సహకరించి, స్వీయ గణన విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు . ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.
