రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్ట్ మృతి

దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు నెల్కి పితంబర్ (51) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతుడు గత 5 రోజుల క్రితం తన బందువుతో పనిమీద వెళ్లి బైక్ పై వస్తుండగా శ్రీరాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జర్నలిస్టు పితంబర్ కు తీవ్ర గాయాలయ్యాయి.

కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి వెంటనే కరీంనగర్ ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు, ఆయన చెందడంతో దండేపల్లి పాత్రికేయులు, మండల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా విశాలాంధ్ర,వార్త, దిన పత్రికలో పనిచేశాడు,ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తనదైన శైలిలో వార్తలు ప్రచురించిన పితంబర్ ఇకలేరు అనే వార్త తోటి పాత్రికేయులకు తీరని లోటు. మృతుని కి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Leave a Reply