14states | ఓట్ల తొలగింపుపై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు

14states | ఓట్ల తొలగింపుపై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు

14states |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 14 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ అమలైన నేపథ్యంలో ఓట్ల తొలగింపుపై అనుమానాలు వ్యక్తం చేశారు.

దుర్మార్గంగా, పకడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. దాదాపు 8.2 కోట్ల ఓట్లు జాబితాలో చేర్చగా, 5.90 లక్షల ఓట్లు తొలగించారని పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటర్ల జాబితా సవరణ పూర్తిగా పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.