141.12 sq km | 1866 సం.లో గుంటూరు మున్సిపాలిటీ ప్రారంభం..
141.12 sq km | 1866 సం.లో గుంటూరు మున్సిపాలిటీ ప్రారంభం..
1994 సంవత్సరంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్..
1995 సంవత్సరంలో మొట్టమొదటి మేయర్ డాక్టర్ కొల్లి శారద..
జీఎంసిలో మొత్తం 4,821 మంది ఉద్యోగులు
ప్రతినెల రూ 14.50 కోట్లు జీతాలు
జీఎంసీని మూడు జోన్ల గా విభజన..
స్పెషల్ గ్రేడ్ ముగ్గురు కమిషనర్లుగా ప్రతిపాదనలు…
141.12 sq km | గుంటూరు కార్పొరేషన్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత పురాతన పట్టణాలలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి. మొట్టమొదటిగా గుంటూరు మున్సిపాలిటీ 1866 సంవత్సరంలో స్థాపించబడింది. అనంతరం 1881లో తొలి ఎన్నికైన పాలక మండలి ఏర్పడింది.కాలక్రమేణా నగర అభివృద్ధి, జనాభా పెరుగుదలతో మున్సిపాలిటీ స్థాయి పెరుగుతూ వచ్చింది. 1891లో II-గ్రేడ్ మున్సిపాలిటీగా, 1917లో I-గ్రేడ్‌గా, 1952లో స్పెషల్ గ్రేడ్‌గా, 1960లో సెలక్షన్ గ్రేడ్‌గా అభివృద్ధి చెందింది.ప్రస్తుతం ఉన్న జీఎంసీ కార్యాలయం 1954 సంవత్సరం జనవరి 13వ తేదీన అప్పటి ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ సీఎం త్రివేది చేతులమీదుగా శంకుస్థాపన చేశారు.

ఆ సమయంలో మున్సిపల్ కమిషనర్ గా ఎస్ అంకన్న ఉన్నారు. ప్రస్తుతం1994లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది.గుంటూరు నగరానికి “గర్తపురి” అనే ప్రాచీన పేరు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. గుంటూరు నగరం విద్యా, వ్యవసాయ, వాణిజ్య రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డు గుంటూరులో ఉండటం నగరానికి ప్రత్యేక ఖ్యాతిని తెచ్చింది.
ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సుమారు 141.12 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. పరిసర ప్రాంతంలోని 10 గ్రామాల విలీనంతో నగర పరిధి మరింత విస్తరించగా, ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో 57 వార్డులు ఉన్నాయి. నగర జనాభా 10 లక్షల పైగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.అమరావతి రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉండటం వల్ల గుంటూరు నగరం వేగంగా అభివృద్ధి చెందుతుంది. రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో మున్సిపల్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషిస్తుంది.
141.12 sq km | మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ల చరిత్ర..
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) ఏర్పడిన తరువాత నగర అభివృద్ధిలో మేయర్లు కీలక పాత్ర పోషించారు. 1995లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్ కొల్లి శారద బాధ్యతలు చేపట్టి జీఎంసీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆమె హయాంలో చుక్కా యేసు రత్నం డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2000 నుంచి 2005 వరకు టిడిపి నుంచి చుక్కా యేసు రత్నం మేయర్‌గా కొనసాగగా, కే.ఎస్. నాగేశ్వరరావు డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2005లో కాంగ్రెస్ పార్టీ నుండి కన్నా నాగరాజు మేయర్‌గా ఎన్నికై 2008 వరకు పదవిలో కొనసాగారు. ఈ కాలంలో తాడిశెట్టి మురళి డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు.2008 నుంచి 2010 వరకు రాయపాటి మోహన్ సాయి కృష్ణ మేయర్‌గా సేవలందించారు.
అనంతరం 2021లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి కావటి శివ నాగ మనోహర్ నాయుడు మేయర్‌గా బాధ్యతలు స్వీకరించి 2025 మార్చి 15 వరకు కొనసాగారు. ఆయనతో పాటు వనమా బాల వజ్ర బాబు, ఎస్కే సజీలా డిప్యూటీ మేయర్లుగా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావటి శివ నాగ మనోహర్ నాయుడు తనమేయర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2025 మార్చి 21 నుంచి ఏప్రిల్ 27 వరకు ఎస్కే సజీలా తాత్కాలిక (ఇంటిరిమ్) మేయర్‌గా పనిచేశారు. టిడిపి తరఫునుంచి 2025 ఏప్రిల్ 28 నుంచి 2026 మార్చి 18వ తేదీ వరకు కోవెలమూడి రవీంద్ర గుంటూరు మేయర్‌గా కొనసాగారు .
ఆయన పదవీకాలంలో వనమా బాల వజ్ర బాబు, ఎస్కే సజీలా డిప్యూటీ మేయర్లుగా ఉన్నారు. పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం జీఎంసీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ కొనసాగుతున్నారు. గుంటూరు నగర అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో వివిధ కాలాల్లో పనిచేసిన మేయర్లు తమ వంతుగా నగర అభివృద్ధికి కృషి చేశారు..
141.12 sq km | జీఎంసీలో మొత్తం 4,821 మంది ఉద్యోగులు ..
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం 4,821 మంది ఉద్యోగులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో పర్మినెంట్ ఉద్యోగులు 587 మంది ఉండగా, పబ్లిక్ హెల్త్ విభాగంలో అధికంగా 2,798 ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, నగర పరిధిలోని 207 స్వర్ణ వార్డు సచివాలయాలలో పరిధిలో మొత్తం 1436 ఉద్యోగులు ఉన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ 4,821 ఉద్యోగులకు ప్రతినెల రూ 14 కోట్ల 50 లక్షలు జీతాలు చెల్లిస్తున్నారు.. జీఎంసిలో పర్మినెంట్ ఉద్యోగుల కన్నా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది.
జీఎంసీ పరిధిని మూడు జోన్లుగా…
ముగ్గురు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గా ప్రతిపాదనలు..
గుంటూరు నగర ప్రజల సౌకర్యార్థం వేగవంతమైన పాలన అందించే దిశగా మూడు జోన్లుగా విభజించి స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ హోదాలో మూడు పోస్టులు మంజూరు కోసం ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం కొరకు పంపించడం జరిగింది. ప్రతిపాదిత జోన్ వివరాలు పరిశీలిస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 26 వార్డులు ఒక జోనుగా, గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 23 వార్డులు కలిపి రెండో జోనుగా, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మొత్తం 8 వార్డులను కలిపి మూడో జోన్ గా విభజించి మార్చి 17వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆమోదించడం జరిగింది. మూడు జోన్లకు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ పోస్టులను మంజూరు చేయటం కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించడం జరిగింది..
CLICK HERE TO READ MORE : Veedi Satheesh | కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన
