65PointsPremium | గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్.. మార్కెట్లపై గ్లోబల్ ప్రభావం
65PointsPremium | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ట్రేడింగ్ ఇన్వెస్టర్లలో ఆశలు పెంచుతోంది. అయితే అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ నేపథ్యంలో మార్కెట్ వర్గాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
గిఫ్ట్ నిఫ్టీ సుమారు 65 పాయింట్ల ప్రీమియంతో 23,527 స్థాయి వద్ద ట్రేడవుతోంది. దీంతో దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. గత ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 49 పాయింట్లు పెరిగి 74,608 వద్ద ముగిసింది.
ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్, జిన్‌పింగ్ మధ్య జరగనున్న కీలక భేటీపై కూడా మార్కెట్ వర్గాలు దృష్టి సారించాయి. అమెరికాలో వడ్డీ రేట్లు, డాలర్ ఇండెక్స్ మార్పులు భారత మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సెన్సెక్స్ 75,000 స్థాయిని దాటితేనే మార్కెట్‌లో స్పష్టమైన రికవరీ కనిపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
