Fire Safety | ఫైర్ సేఫ్టీ లోపాలపై రంగనాథ్ ఆరా

Fire Safety | ఫైర్ సేఫ్టీ లోపాలపై రంగనాథ్ ఆరా

నాలా ఆక్రమిస్తే కూల్చివేత ఖాయం..

Fire Safety | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్‌ మైత్రీవనం అగ్నిప్రమాద ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇవాళ‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో నష్టపోయిన బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించి పలు కీలక అంశాలను పరిశీలించిన ఆయన, భవన నిర్మాణ అనుమతులు, ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై దృష్టి సారించారు.

అనుమతులు, నాలా ఆక్రమణలపై విచారణ

మైత్రీవనం సమీపంలోని కేఎస్ఆర్ భవనానికి అవసరమైన అనుమతులున్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తామని రంగనాథ్ తెలిపారు. ఒకవేళ నాలాను ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టినట్లు తేలితే కచ్చితంగా కూల్చివేస్తామని హెచ్చరించారు. ఘటనకు సంబంధించి హర్ష డీలక్స్ మెస్‌ను కూడా పరిశీలించినట్లు చెప్పారు.

ఫైర్ సేఫ్టీ నిబంధనలపై ప్రశ్నలు

అగ్నిప్రమాదం స్పార్క్ వల్ల జరిగిందా, షార్ట్‌సర్క్యూట్ కారణమా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలుతుందని రంగనాథ్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన భవనంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఒకే వైపు ఉండటంతో పాటు ఫైర్ సేఫ్టీ నిబంధనలు సరిగా పాటించలేదని తెలిపారు. హర్ష మెస్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నప్పటికీ, అసలు కారణాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.

Leave a Reply