13thevent | 50మందికి అస్వస్థత

13thevent | 50మందికి అస్వస్థత

13thevent | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కలుషిత ఆహారం కారణంగా పలువురు అస్వస్థతకు గురైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో ఓ కార్యక్రమంలో మిగిలిన బిర్యానీ తిన్న గ్రామస్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.

13వ తేదీన జరిగిన కార్యక్రమంలో మిగిలిపోయిన బిర్యానీని 14వ తేదీన గ్రామస్థులు తిన్నట్లు సమాచారం. అనంతరం రాత్రి నుంచి పలువురికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 50మందికి పైగా అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం 44మంది కోలుకుంటుండగా, తీవ్ర అస్వస్థతకు గురైన మరో ఆరుగురిని తెనాలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై స్పందించిన డీఎంహెచ్‌వో విజయలక్ష్మి కొత్తరెడ్డిపాలెంను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

Leave a Reply