100% exemption| ఈవీ వాహనాలకు భారీ డిస్కౌంట్

100% exemption| ఈవీ వాహనాలకు భారీ డిస్కౌంట్
100% exemption | కొనుగోలుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రోత్సాహం
ప్రభుత్వ ఉద్యోగులకు అధిక రాయితీ
ప్రజాప్రతినిధులకు లోన్ సౌకర్యం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచే లక్ష్యంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అడుగులు వేస్తోన్నాయి. కాలుష్య రహిత వాతావరణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తోంది. పెట్రోల్ -డీజిల్ ధరలు ప్రజలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై భారీగా ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించాయి. వాహనాల కొనుగోలుపై తెలంగాణ ప్రభుత్వం భారీ రాయితీలు, సబ్సిడీలు అందించేందుకు సిద్ధమైంది. కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా EV పాలసీ అమలు చేస్తోంది. దీంతో ఉద్యోగులకు తక్కువ ధరకే EVలు లభించే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 15-20% డిస్కౌంట్, ఆటోలకు 100% సబ్సిడీ, కేంద్రం నుండి PM E-DRIVE పథకం కింద సబ్సిడీలు, అలాగే ఆదాయపు పన్నులో (80EEB) రూ. 1.5 లక్షల వరకు మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలపై ఉద్యోగులకు 15% నుంచి 20% వరకు డిస్కౌంట్ ఇవ్వాలని కంపెనీలకు సూచనలు చేసింది. ఆయా కంపెనీలతో ప్రభుత్వం నుంచి ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇప్పటికే కొన్ని వాహన తయారీ సంస్థలు ఇందుకు అంగీకారం తెలిపాయి. అంతేకాకుండా EV పాలసీ కేవలం ఉద్యోగులకే కాదు, సాధారణ ప్రజలకూ వర్తిస్తుంది. కొత్త ఎలక్ట్రిక్ కారుపై రూ.లక్ష వరకు ప్రోత్సాహకం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% మినహాయింపు ఇవ్వనున్నట్లు, అలాగే దీని వల్ల మొత్తం ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు. అలాగే ప్రజా ప్రతినిధులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక వాహన రుణాలు అందించనున్నట్లు తెలిపారు.

