విశాఖపట్నం, :- అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖలో భారీ స్థాయిలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇంచార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి,అధికారులు పాల్గొన్నారు.
అ సందర్బంగా అనిత మాట్లాడుతూ, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన విశాఖలో నిర్వహించడం గర్వకారణం అన్నారు. యోగం అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనస్సుకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని, యోగా మన జీవన విధానంలో భాగం కావాలని సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతలు ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండటానికి యోగానే కారణం అని అన్నారు. ప్రజలు ప్రతిరోజూ కనీసం ఒక గంట యోగానికి సమయం కేటాయిస్తే, రోజంతా ఉత్సహంగా గడిపేందుకు వీలు ఉంటుందని చెప్పారు. జూన్ 21న జరిగే యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారని హోం మంత్రి అనిత తెలిపారు.
