తెలుగు జాతి గుర్తింపు కోసం అమరుడైన పొట్టి శ్రీరాములు

తెలుగు జాతి గుర్తింపు కోసం అమరుడైన పొట్టి శ్రీరాములు

పురపాలక సంఘ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు 125వ‌ జయంతి వేడుకలు…

గుడివాడ – ఆంధ్రప్రభ : తెలుగుజాతి గుర్తింపు కోసం చనిపోయే వరకు పోరాడి అమరుడైన పొట్టి శ్రీరాములు మహనీయుడని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు. శ్రీరాములు లాంటి మహనీయుల స్ఫూర్తితోనే ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు. గుడివాడ పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో భాగంగా అమరావతిలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు స్మృతి వనం ప్రారంభం, విగ్రహవిష్కరణ వేడుకలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులు అధికారులతో కలిసి వీక్షించారు. ముందుగా ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం… పురపాలక సంఘం ఆధ్వర్యంలో వాసవి చౌక్ వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాము వైశ్య సంఘాల పెద్దలు, కూటమి నాయకులతో కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ… పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం పొట్టి శ్రీరాములని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం పోతున్న లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా పోరాడిన మహనీయుడు అన్నారు. అమరజీవి జయంతి వేడుకల్లో పాల్గొని ఆయనకి నివాళులర్పించడం గర్వంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భాషా ప్రయత్ని రాష్ట్రాలకు అధ్యుడైన శ్రీరాములు, తెలుగు జాతి ఉన్నంతకాలం అమరుడిగా నిలిచే ఉంటారన్నారు.

ఆయనకు నివాళిగా కూటమి ప్రభుత్వం అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం,58 అడుగుల శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. చాలాకొద్ది మందే జాతికోసం ఆలోచిస్తారని.. ఇదేకోవలో తెలుగు జాతి కోసం ఆలోచించి, ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అమరజీవి అని కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల స్ఫూర్తితో సుపరిపాలన అందిస్తున్నామని.. సుస్థిర ప్రభుత్వంతోనే నిరంతర సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్ డబ్ల్యూ సి చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, డిఎల్డిఓ సునీత శర్మ, ఇంచార్జ్ కమిషనర్ కే సతీష్ చంద్ర, ఎండిఓలు విష్ణు ప్రసాద్,మల్లీశ్వరి,ఇమ్రాన్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ నరసింహులు, అడల్ట్ ఎడ్యుకేషన్ నోడల్ అధికారి అజయ్,ఎంఈవో బాలాజీ, సీఐ శ్రీనివాస్, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ,రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, వాసే మురళి, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్,సీనియర్ టిడిపి నాయకులు ,లింగం ప్రసాద్, చేకూరు జగన్మోహన్రావు, టీడీపీ నాయకులు పండ్రాజు సాంబయ్య, కొత్త మురళీకృష్ణ,యాక్కలి మనిదీప్,వేశపోగు ఇమ్మానుయేలు, రామిదేని వేణుబాబు, బి.హరిబాబు, పోలాసి ఉమయ్య, వసంతవాడ దుర్గారావు, కంచర్ల సుధాకర్, అందుగుల యేసు పాదం, బీజేపీ నాయకులు, సురే లక్ష్మీనారాయణ గాంధీ, అంగడాల సతీష్, వైశ్య సంఘాల నాయకులు బెజవాడ బాజీ, మాటూరి రంగనాథ్, బొగ్గారపు తిరుపతయ్య, తాడిపర్తి శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో వైశ్య సంఘాల నేతలు కూటమి నాయకులు, పలు ప్రభుత్వ శాఖలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.