నివాళులు..

నివాళులు..
చల్లపల్లి, ఆంధ్రప్రభ : చల్లపల్లి పంచాయతీలోని రాధానగర్ కు చెందిన ప్రముఖులు నెర్సు యజ్ఞనారాయణ మృతదేహానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు నివాళులు అర్పించారు. యజ్ఞనారాయణ శుక్రవారం ఆకస్మికంగా మరణించారు. విషయం తెలుసుకున్న విక్కుర్తి శ్రీనివాస్ శనివారం ఉదయం రాధానగర్ లోని గృహంలో యజ్ఞ నారాయణ మృతదేహానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు శ్రీనివాస్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యజ్ఞనారాయణ మృతిపట్ల విక్కుర్తి విచార వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, విక్కుర్తి రాంబాబు, న్యాయవాది విక్కుర్తి రామకృష్ణ, పులిగడ్డ చంద్ర, కస్తూరి విజయ్ కుమార్,భూపతి నాంచారయ్య,బర్మా శ్రీను,రేపల్లె ముసలయ్య, రేపల్లె ఈశ్వరరావు,బర్మా బుజ్జి తదితరులు యజ్ఞనారాయణకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
