ఉద్యోగాల పేరుతో..

మహిళలతో అక్రమ సంబంధాలు..?

లెక్చరర్ జాషువాపై భార్య ఆరోపణలు ..
దేహశుద్ధి చేసిన భార్య…

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా బందరు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడు జాషువాపై అతని భార్య తీవ్ర ఆరోపణలు చేసింది. అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న జాషువా, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మహిళలను లోబరుచుకుంటున్నాడని భార్య ఆరోపించింది.

గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బందరు ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న జాషువా వ్యవహారంపై భార్య బహిరంగంగా ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమైంది. ఉద్యోగాల పేరుతో పలువురు మహిళలను మోసం చేస్తున్నాడని, తనను కూడా మానసికంగా వేధిస్తున్నాడని భార్య ఆరోపించింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే భార్య చేసిన ఆరోపణలపై పూర్తి విచారణ చేపట్టనున్నారు.

Leave a Reply