అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు..

అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు..
బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి గ్రామం నందు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై ప్రాణత్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి బైక్ ర్యాలీలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగురాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శం మని ఆయన త్యాగం చిరస్మరణీయం మని మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషిచేశారని కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
