బందర్ లో తెలుగుదేశం – వైసిపి పార్టీ మధ్య మాటల యుద్ధం

బందర్ లో తెలుగుదేశం – వైసిపి పార్టీ మధ్య మాటల యుద్ధం

మంత్రిపై వైసీపీ ఇంచార్జి విమర్శలు

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లాలో రాజకీయ విమర్శలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. మచిలీపట్నం కేంద్రంగా అధికార–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
వైసీపీ మచిలీపట్నం ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి పదవిలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపుల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిని ఊడగొట్టడం వెనుక డబ్బుల వ్యవహారం ఉందని ప్రశ్నించారు. ఇది కక్ష సాధింపు కాదా అని నిలదీశారు.

అదేవిధంగా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుమ్మరిగూడెంలో నిర్మించిన హౌసింగ్ ఇళ్లను కూల్చివేయడం కూడా రాజకీయ ప్రతీకారమేనని పేర్ని కృష్ణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలతో మచిలీపట్నంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అధికార–ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతుండటంతో జిల్లా రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి.

Leave a Reply